ambika: నాలానే రాధ కూడా నాన్న జేబులో నుంచి డబ్బులు తీసేది: అంబిక

షార్ట్స్‌లో చూడండి
రాధ తెలుగులో అగ్రకథానాయిక అనిపించుకోగా, ఆమె అక్క అంబిక తమిళ .. మలయాళ భాషల్లో హీరోయిన్ గా రాణించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అంబిక మాట్లాడుతూ కొన్ని సరదా సంఘటనలను గురించి చెప్పుకొచ్చారు. "చిన్నప్పుడు నాకు బెల్లంతో చేసిన పల్లీ ఉండలు అంటే చాలా ఇష్టం. వాటిని కొనుక్కోవడానికి డబ్బులు కావాలి గదా .. ఆ డబ్బులు నాన్న జేబులో నుంచి తీసే దానిని.

ఉదయాన్నే నాన్న స్నానానికి వెళ్లగానే పిల్లిలా వెళ్లి ఆయన జేబులో నుంచి రెండు రూపాయలు దొంగతనంగా తీసే దానిని. ఒకసారి నాన్నకి దొరికిపోయి చీవాట్లు తిన్నాను. ఆ తరువాత ఆయన జేబులో నుంచి రాధ దొంగతనంగా డబ్బులు తీయడం మొదలు పెట్టింది. తను కూడా దొరికిపోయింది .. కాకపోతే అప్పుడు తను నేను తీసినట్టుగా నా పేరు చెప్పింది. నేను కూడా ఒప్పేసుకుని నాన్నతో మళ్లీ చీవాట్లు తిన్నాను" అంటూ నవ్వేశారు.         
Go Back to Shorts
ambika
radha

More Telugu News