విజయనగరంలో 12 నుంచి ప్రజాసంకల్పయాత్ర.. పాల్గొననున్న వైఎస్ జగన్!
- ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పార్టీ శ్రేణులు
- సోమవారం పాయకపాడులో మొదలు
- గాయం నుంచి కోలుకున్న జగన్
సోమవారం పాయకపాడు నుంచి మొదలుకానున్న ప్రజాసంకల్పయాత్ర, 13వ తేదీన పార్వతీపురం నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గ నేతలు, వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేలకు వాడే కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావును ఈ నెల 23 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ విశాఖపట్నంలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.