rp patnayak: కులశేఖర్ కి కొంచెం కోపం ఎక్కువ: ఆర్పీ పట్నాయక్

షార్ట్స్‌లో చూడండి
ప్రేమ నేపథ్యంలో సాగే పాటలకి బాణీలు కట్టడంలో ఆర్పీ పట్నాయక్ సిద్ధహస్తుడు. ఈ కారణంగానే ఆయన పాటలు యూత్ కి బాగా చేరువయ్యాయి. తేజ సినిమాలకి ఆర్పీ పట్నాయక్ తప్పనిసరి సంగీత దర్శకుడిగా ఉండేవారు. ఇక ఆర్పీ సంగీతం అనేసరికి కులశేఖర్ పాటలు రాసేవారు. ఈ ముగ్గురూ కలిసి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ఒక సందర్భంలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ పాటల రచయిత కులశేఖర్ గురించి ప్రస్తావించారు.

'చిత్రం' సినిమా సమయంలో తేజకి కులశేఖర్ ను పరిచయం చేశాను. ఆయన ప్రతిభను గుర్తించిన తేజ వరుస అవకాశాలు ఇచ్చారు. అయితే కులశేఖర్ కి కొంచెం కోపం ఎక్కువ. వెంటనే ఆ కోపం తగ్గిపోయేది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది. ఆయన ధోరణి నాకు తెలుసు కనుక .. నేను పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని కాదు. కులశేఖర్ కి అవకాశాలు తగ్గడానికి ఆయన కోపం ఒక కారణం" అంటూ చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
rp patnayak
teja
kulasekhar

More Telugu News