anushka: మొత్తానికి అనుష్క ఒక సినిమాను ఒప్పేసుకుంది!

  • అనుష్క ప్రధాన పాత్రగా మూవీ 
  • వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి 
  • అనుష్క జోడిగా కనిపించనున్న మాధవన్      

'భాగమతి' మంచి విజయమే సాధించినప్పటికీ, ఆ తరువాత అనుష్క మరే సినిమాను అంగీకరించలేదు. రీసెంట్ గా ఆమె ఒక సినిమా చేయడానికి ఒప్పుకుందనేది తాజా సమాచారం. రచయిత కోన వెంకట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కోన వెంకట్ - గోపీ మోహన్ రచయితలుగా పనిచేసిన ఈ సినిమాకి, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు.

నటుడు సుబ్బరాజు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కథ ప్రకారం ఎక్కువభాగం చిత్రీకరణ యూఎస్ లో జరగనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అక్కడ షూటింగు మొదలవుతుందని కోన వెంకట్ చెప్పారు. అనుష్క ప్రధాన పాత్రగా సాగే ఈ సినిమాలో ఆమె జోడీగా మాధవన్ కనిపించనున్నారు. ఒక పుష్కరకాలం తరువాత అనుష్క .. మాధవన్ లు కలిసి నటిస్తుండటం విశేషం.  

More Telugu News