మాజీ భార్య సంతోషంగా ఉందని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ప్రబుద్ధుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ భార్య సంతోషంగా ఉందని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ప్రబుద్ధుడు!

  • జార్ఖండ్ లోని నారాయణ పురలో ఘటన
  • మాజీ భార్య సినిమాకు వెళ్లడంతో ఆగ్రహం
  • చిత్రహింసలు పెట్టి చంపిన మాజీ భర్త
తాను విడాకులు ఇచ్చినా భార్య(23) ఆనందంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశాడు. అక్కడితో కసి చల్లారకపోవడంతో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడంతో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. జార్ఖండ్ లోని నారాయణపుర ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా ఉంటున్న ఓ యువతి(23)కి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో కొన్నిరోజుల క్రితం వివాహమైంది. అయితే ఇద్దరికి పొసగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపురలో ఉన్న ఓ థియేటర్ లో సినిమా చూడటానికి యువతి వెళ్లడాన్ని గమనించిన ఆమె భర్త పగతో రగిలిపోయాడు. తనను వదిలేసి సంతోషంగా ఉన్న ఆమెపై కసి తీర్చుకోవాలని భావించి మాజీ భార్యను అనుసరించాడు. సాయం కోసం ఇద్దరు స్నేహితులను పిలిపించాడు.

సినిమా ముగిశాక ఇంటికి తిరిగివస్తున్న యువతిని ముగ్గురు మార్గమధ్యంలో అడ్డగించారు. అనంతరం సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అక్కడితో కసి చల్లారక ఆమెను తీవ్రంగా చిత్రవధ చేసి గాయపరిచారు. చివరికి గాయాలతో ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన బాధితురాలు బాధ తాళలేక రోదించడంతో అటుగా వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కాగా, చనిపోయేముందు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ భర్తతో పాటు ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
jarkhand
gang rape
Police
husband and friends
ex wife

More Telugu News