తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఫ్యాక్టరీ
- కార్ల విడిభాగాల తయారీలో కంపెనీలో అగ్రిప్రమాదం
- భారీగా ఆస్తినష్టం
- ఫ్యాక్టరీలో చిక్కుకున్న పలువురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్యాక్టరీలో చిక్కుకున్న పలువురు ఉద్యోగులను వారు రక్షించారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసుందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.