జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాలంటూ మరో పిటిషన్ వేసిన సిట్
- గత విచారణలో తగిన వివరాలను రాబట్టలేకపోయాం
- మరోసారి అతన్ని విచారించాల్సిన అవసరం ఉంది
- శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వండి
శనివారం నాడు శ్రీనివాస్ కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే. కోర్టులో అతన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కస్టడీని పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. అయితే, ఆ పిటిషన్ ను న్యాయయూర్తి తిరస్కరించారు. శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో, సిట్ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి తర్వాత మరోసారి విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.