Go Air: ప్రయాణికుల లగేజ్ ని వదిలేసి టేకాఫ్ అయిన గో ఎయిర్ విమానం!

షార్ట్స్‌లో చూడండి
శ్రీనగర్ నుంచి జమ్మూ బయలుదేరిన గో ఎయిర్ విమానం, ప్రయాణికుల లగేజ్ ని వదిలేసి టేకాఫ్ తీసుకుంది. తీరా, విమానం ల్యాండ్ అయిన తరువాత, తమ లగేజ్ రాలేదని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో, జరిగిన దానికి చింతిస్తూ, సంస్థ ఓ ప్రకటన వెలువరించింది. జీ8 213 సర్వీసులో కొందరు పాసింజర్ల లగేజ్ ని లోడ్ చేయలేదని అంగీకరించింది.

వాతావరణ పరిస్థితులు, విమానంలోని బరువు కారణంగా లగేజ్ ని ఎక్కించలేదని, ఆ వెంటనే మరో సర్వీసులో కొందరి లగేజీలను జమ్మూకు పంపించామని తెలిపింది. మిగిలిన వారి లగేజీలను వారి వారి స్వస్థలాలకు పంపించి అందిస్తామని తెలిపింది. విమానాశ్రయంలో వేచిచూస్తున్న ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో ఇలా జరిగిందని, తదుపరి గమ్యస్థానాలకు చేరాల్సిన వారి లగేజీలకు ప్రాధాన్యం ఇచ్చామని గో ఎయిర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Go Back to Shorts
Go Air
Luggage
Jammu
Srinagar

More Telugu News