Dasoju Sravan: గాదె కింద పందికొక్కులా మారి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుని తింటున్నారు: కాంగ్రెస్ నేత శ్రవణ్

  • అమ్మా బొమ్మా అంటున్న వాళ్లే గుంటనక్కలు
  • సెంటిమెంట్ అనే ఆయింట్‌మెంట్ రాస్తున్నారు
  • రెండు నక్కలూ ప్రగతి భవన్‌లోనే ఉన్నాయి
ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ ముసలి నక్క, గుంట నక్క అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వెబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముసలి నక్క, గుంటనక్క రెండూ ప్రగతి భవన్‌లోనే ఉన్నాయని విమర్శించారు.

అమ్మా బొమ్మా అంటున్న వాళ్లే గుంటనక్కలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పరిపాలించమని అధికారమిస్తే సెంటిమెంట్ అనే ఆయింట్‌మెంట్ రాస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. గాదె కింద పందికొక్కులా మారి తెలంగాణను దోచుకుతింటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్లి బొక్క బోర్లా పడుకుని ఆమె కాళ్లకు మొక్కి వచ్చారని శ్రవణ్ గుర్తు చేశారు. 
Dasoju Sravan
KTR
Telangana
KCR
Sonia Gandhi

More Telugu News