వివాదాస్పదమైన నటి దివ్య స్పందన ట్వీట్.. ప్రధాని మోదీని పక్షి రెట్టగా అభివర్ణించిన కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ హెడ్!
- మరోమారు వివాదాస్పదమైన దివ్య స్పందన
- సర్దార్ పటేల్ విగ్రహం కాళ్ల వద్ద మోదీ
- అది పక్షి రెట్టా? అని ప్రశ్నించిన దివ్య
రమ్య ట్వీట్‌పై స్పందించిన బీజేపీ.. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇదేనని విమర్శించింది. కాంగ్రెస్ విలువలకు ఇదో ఉదాహరణ అని మండిపడింది. కాగా, దివ్య స్పందన గతంలోనూ ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని దొంగగా అభివర్ణించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన యూపీకి చెందిన ఓ న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ ఆమెపై దేశద్రోహం, ఐటీ చట్టం కింద కేసు పెట్టారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని దివ్య.. మోదీ ముమ్మాటికీ దొంగేనని మరోమారు ట్వీట్ చేశారు.