Chandrababu: చంద్రబాబుతో సమావేశం బాగా జరిగింది: రాహుల్ గాంధీ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం బాగా జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో రాహుల్ తో చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు గంటపాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం, రాహుల్, చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

తొలుత రాహుల్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయించామని, దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నామని అన్నారు. పాత విషయాల జోలికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు. భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తామని, గత విషయాల జోలికి వెళ్లదలచుకోలేదని, భవిష్యత్ గురించి మాత్రమే మాట్లాడదలచుకున్నామని అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇకపై, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా రాఫెల్ కుంభకోణం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. రాఫెల్ కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసునని, ఈ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సరైన విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు. రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తు జరపాల్సిన సంస్థలపై దాడి జరుగుతోందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలపై జరిగే దాడిని ఆపడమే తమ ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, బీజేపీ కుంభకోణాలపై ఉద్యమిస్తామని, మోదీ నుంచి మీడియాకు ఉన్న కొన్ని ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Rahul Gandhi
delhi

More Telugu News