5 odi: ఐదో వన్డే.. భారత్ విజయ లక్ష్యం 105 పరుగులు

షార్ట్స్‌లో చూడండి
కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్ జట్టు 104 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు విజృంభించడంతో 31.5 ఓవర్లకే విండీస్ జట్టు ఆలౌట్ అయింది. కాగా, భారత్ కు కేవలం105 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని విండీస్ జట్టు నిర్దేశించింది. సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ జట్టు ఉత్సాహంగా ఉంది.

విండీస్ బ్యాటింగ్: 

కేవోఏ పావెల్ (0), ఆర్. పావెల్ (16), హోప్ (0), సామ్యూల్స్ (24), హెట్ మయర్ (9), హోల్డర్ (25), అలెన్ (4), పాల్ (5), రోచ్ (5), థామస్ (0), బిషూ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత్ బౌలింగ్ :  

భువనేశ్వర్ కుమార్ -1, బుమ్రా -2, కేకే అహ్మద్ -2, జడేజా - 4, కులదీప్ యాదవ్ -1
Go Back to Shorts
5 odi
thiruvanatha puram
westindies
India

More Telugu News