టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ బంధువు ఆఫీసు, ఇళ్లపై ఐటీ దాడులు!
- పేరం గ్రూపు ఆఫీసులో తనిఖీలు
- ఉదయాన్నే చేరుకున్న ఐటీ బృందాలు
- రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ
ఈ రోజు ఉదయాన్నే విశాఖపట్నంతో పాటు మిగిలిన చోట్లకు చేరుకున్న ప్రత్యేక బృందాలు.. తనిఖీలు చేపడుతున్నాయి. దాదాపు 15 రోజుల క్రితం ఇక్కడ తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మిన నేపథ్యంలో దానికి వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చెల్లించలేదన్న విషయమై ఐటీ శాఖ తాజా దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.
కాగా, పేరం గ్రూపు అధినేత హరిబాబు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ బంధువు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో హరిబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కంపెనీ, ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్నారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.