చంద్రబాబు మైండ్ పని చేయడం లేదనే విషయం నాకు స్పష్టంగా అర్థమవుతోంది: లక్ష్మీపార్వతి
- జగన్ ను కనీసం పరామర్శించలేదు
- ఎన్నికల్లోపు ఇంకెన్ని దాడులు చేయిస్తారో అనే భయం కలుగుతోంది
- హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు
జగన్ కు ప్రజల్లో సానుభూతి వస్తుందనే భయంతో అనుకూలమైన ఛానళ్లలో రకరకాల కథనాలను చంద్రబాబు ప్రసారం చేయించారని లక్ష్మీపార్వతి విమర్శించారు. జగన్ ను అంతం చేయాలనే ప్రయత్నం జరిగిందన్న విషయం చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఇంకెన్ని దాడులు చేయిస్తారో అనే భయం తమలో నెలకొందని చెప్పారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని... రాష్ట్రంలో శాంతిభద్రతలు చేజారి పోయాయని అన్నారు. ఏమాత్రం మానవత్వం ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు చంద్రబాబు సిద్ధం కావాలని... తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తామని చెప్పారు.