Vichai Srivaddhanaprabha: కారు పార్కింగ్ స్థలంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఫుట్‌బాల్ క్లబ్ యజమాని దుర్మరణం!

  • ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించి వెళ్తుండగా ప్రమాదం
  • పైకి లేచిన కాసేపటికే కుప్పకూలిన వైనం
  • మంటల్లో సజీవ దహనం

థాయ్‌లాండ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన విచాయ్ శ్రీవద్దన్ ప్రభ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంగ్లిష్ ఫుట్‌బాల్ క్లబ్ ‘లెసిస్టర్ సిటీ’ యజమాని కూడా అయిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్లబ్ కారు పార్కింగ్ స్థలంలోనే కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో అందులో ఉన్న విచాయ్ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

శనివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హెలికాప్టర్ పైకి లేచిన కాసేపటికే అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చుట్టుముట్టినట్టు పేర్కొన్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News