తెలంగాణలో కొలిక్కి వచ్చిన మహాకూటమి సీట్ల పంపకం... కాంగ్రెస్‌కు 91, టీడీపీకి 15, టీజేఎస్‌కు 8, సీపీఐకి 5 సీట్లు!
- ఢిల్లీలో చంద్రబాబుతో ఉత్తమ్, రమణ భేటీ
- కొన్ని సీట్ల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
- అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలన్న బాబు
ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పటికీ ఏయే స్థానాల్లో అన్న విషయంలో స్పష్టత లేదు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఎల్.బి.నగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ వంటి సీట్ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, అక్కడ పార్టీకి ఉన్న అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అవసరమైన త్యాగాలు కూడా తప్పవని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.