ఢిల్లీ టూర్.. చంద్రబాబుతో సమావేశమైన కేజ్రీవాల్, శరద్ యాదవ్!
- కేంద్రం, గవర్నర్ల వ్యవహారశైలిపై చర్చ
- మరికాసేపట్లో మీడియా సమావేశం
- పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న సీఎం
ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకపోవడం, టీడీపీ నేతలు, మద్దతుదారులు లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు జాతీయ మీడియా సమావేశంలో ప్రస్తావించనున్నారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు సీబీఐలో జరుగుతున్న అధికార పోరుపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ‘డెమోక్రసీ ఇన్ డేంజర్.. టార్గెట్ ఏపీ’ పేరుతో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.