Chandrababu: ఇదంతా చంద్రబాబునాయుడు, డీజీపీ డైరెక్షన్ లో జరుగుతోంది: అంబటి అనుమానం

షార్ట్స్‌లో చూడండి
జగన్ తనపై సానుభూతి కోసం పొడిపించుకోవాల్సిన అవసరం లేదని, ఈ కుట్ర అంతా చంద్రబాబునాయుడు, డీజీపీ డైరెక్షన్ లో జరుగుతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిందితులను కాపాడేందుకు వీళ్లు ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో చంద్రబాబు, డీజీపీ పాత్ర ఉందేమోననే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

కాగా, వైసీపీకి చెందిన మరో నేత పార్ధసారథి మాట్లాడుతూ, ఏపీ పోలీసులను జగన్ అవమానించినట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని అన్నారు. అధికారులను తక్కువ చేసి తాము మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయాలని తాము కోరలేదని చెప్పారు. చంద్రబాబు దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేస్తారని, అందుకే, స్థానిక దర్యాప్తును వద్దంటున్నామని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
ap dgp
ambati

More Telugu News