జగన్ పై దాడి... టీమిండియా క్రికెటర్లకు కష్టాలు
- మూడో వన్డే కోసం పూణే వెళ్లడానికి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన కోహ్లీ సేన
- అదే సమయంలో జగన్ పై దాడి
- అంతా సద్దుమణిగిన తర్వాత ఎయిర్ పోర్టులోకి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు
దీంతో, క్షణాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. భద్రతా కారణాల రీత్యా ఎయిర్ పోర్టు లోనికి ఎవరినీ పంపలేదు. దీంతో, విమానాశ్రయానికి కాస్త దూరంలోనే వాహనాలు ఆగిపోయాయి. ఈ వాహనాల్లో భారత క్రికెటర్లు ఉన్న రెండు బస్సులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జగన్ హైదరాబాదుకు వెళ్లిపోయారు. అనంతరం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ... టీమిండియా ఆటగాళ్లు మరో విమానంలో పూణేకు బయల్దేరి వెళ్లారు.