అదే జరిగి ఉంటే నేను, డీజీపీ దోషులుగా నిలబడాల్సి వచ్చేది: పోలీసులపై చంద్రబాబు సీరియస్
- పెద్దదాడి జరిగుంటే పరిస్థితి ఏంటి?
- పోలీసుల స్పందన సరిగ్గా లేదు
- ఐబీ చీఫ్ పై చంద్రబాబు అసహనం
మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ పై దాడి జరుగగా, సాయంత్రం 4 గంటల వరకూ పోలీసుల స్పందన సరిగ్గా లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపైనా అసహనాన్ని వ్యక్తం చేశారు. దాడి ఘటన తరువాతి పరిణామాల్లో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు నిందించారు. పోలీసులు విఫలమైతే చెడ్డపేరు తన ప్రభుత్వానికే వస్తుందన్న సంగతిని మరువరాదని హెచ్చరించారు.