బాణసంచాను నిషేధించలేము: సుప్రీంకోర్టు రూలింగ్
- సెంటిమెంట్ తో ముడిపడిన పర్వదినం
- అమ్మకాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది
- బాణసంచా తయారీపై ఆధారపడిన 5 వేల కుటుంబాలు
పలువురు న్యాయవాదులు, ప్రజాసంఘాలు బాణసంచా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం, నేడు తీర్పును వెలువరించింది. గత సంవత్సరం ఢిల్లీలో బాణసంచా నిషేధాన్ని విధించిన సంగతిని ప్రస్తావిస్తూ, కాలుష్య మార్పులను తెలుసుకునేందుకే నాడు ఆ నిర్ణయం తీసుకున్నామని, గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో దీపావళి ముందు, ఆ తరువాత ఢిల్లీలో కాలుష్యంపై పూర్తి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.