వినోదపన్నుకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో సమరం.. 400 థియేటర్ల మూత!
- 28 శాతం జీఎస్టీకి అదనంగా 15 శాతం వినోదపన్ను
- ప్రభుత్వ తీరుపై థియేటర్ యాజమాన్యాల నిరసన
- ఈ నెల 5 నుంచి 400 సినిమా హాళ్ల మూత
ఇప్పటికే టికెట్లపై 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తుండగా, ఇప్పుడు స్థానిక సంస్థలు వినోదపు పన్ను పేరుతో 5-15 శాతం అదనపు సుంకం విధించడంతో మరో గత్యంతరం లేని థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ల మూసివేతతో అందులో పనిచేస్తున్న వారు జీవనాధారాన్ని కోల్పోతున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా స్పందించాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు జితేంద్ర జైన్ కోరారు.