లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి.. మజ్జిగ ప్యాకెట్ ఇచ్చే స్తోమత కూడా లేదా?: పరిటాల సునీత
- తుపాను ప్రభావిత గ్రామాల్లో తిరిగాను
- చంద్రబాబు సహాయక కార్యక్రమాలను అందరూ మెచ్చుకుంటున్నారు
- ఇద్దరు వైసీపీ నేతలు కూడా చంద్రబాబును పొగిడారు
జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టమని సునీత విమర్శించారు. పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన... ఇంతవరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని మండిపడ్డారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి... తుపాను బాధితులకు కనీసం మజ్జిగ ప్యాకెట్ ఇచ్చే స్తోమత కూడా లేదా? అని ప్రశ్నించారు.