Wildlife Photographer of the year: ఓ పైపులో పగటిపూట గుడ్లగూబలు... పదేళ్ల చిన్నారికి అవార్డు తెచ్చిపెట్టిన ఫొటో!

  • ఫొటోగ్రాఫర్ రణ్ దీప్ సింగ్ కుమారుడు అర్షదీప్ సింగ్
  • తండ్రితో కారులో వెళుతున్న వేళ కనిపించిన గుడ్లగూబలు
  • న్యాచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహించే వార్షిక పోటీల్లో బహుమతి

గుడ్లగూబలు పగటి పూట కనిపించడం చాలా అరుదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అటువంటి గుడ్లగూబలు పగటి పూట కనిపిస్తే, అది కూడా పదేళ్ల చిన్నారికి. వాటిని తన కెమెరాతో క్లిక్ మనిపించిన చిన్నారికి ఈ సంవత్సరం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన ఫొటోగ్రాఫర్ రణ్ దీప్ సింగ్ కుమారుడు అర్షదీప్ సింగ్ (10) ఈ ఘనతను అందుకున్నాడు.

 ఆరేళ్ల వయసు నుంచి ఫొటోలు తీస్తున్న అర్షదీప్ కు జూనియర్ ఏషియన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు గతంలోనే రావడం గమనార్హం. అతను తీసిన ఎన్నో చిత్రాలు ఇంటర్నేషనల్ మేగజైన్ లో ప్రచురితం అయ్యాయి. ఇక, ఇటీవల అతను తన తండ్రితో కలసి కారులో వెళుతున్న వేళ, ఓ నీటి పైపులో రెండు చిన్న గుడ్లగూబలు కనిపించాయి. వెంటనే కారును ఆపమని కోరిన అర్షదీప్, తన కెమెరాలో వీటిని బంధించాడు. ఆ ఫొటో ఇప్పుడు లండన్ లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహించే వార్షిక పోటీల్లో బహుమతి గెలుచుకుంది.

More Telugu News