నా కుటుంబసభ్యులకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత: రాములు నాయక్

  • రేపటి నుంచి నాపై భౌతిక దాడులు జరుగుతాయి
  • ప్రెస్ మీట్ల ద్వారా నాపై విమర్శలు చేయిస్తారు
  • నిన్న కురిసింది వర్షం కాదు.. అమరవీరుల కన్నీరు
రేపటి నుంచి తనపై భౌతిక దాడులు జరుగుతాయని, ప్రెస్ మీట్ల ద్వారా విమర్శలు చేయిస్తారని టీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు చేసిన ఆయన సెటైర్లు విసిరారు. నిన్న హైదరాబాద్ లో కురిసింది వర్షం కాదని.. మోసపూరిత వాగ్దానాలను చూసి తెలంగాణ కోసం అసువులు బాసిన 1200 మంది అమరవీరులు కార్చిన కన్నీరని ఆయన అన్నారు. 
kcr
ramulu naik
TRS rebel

More Telugu News