చంద్రబాబును ఏమీ చేయలేక వారిని కీలుబొమ్మలుగా వాడుకుంటోంది: బీజేపీపై సబ్బం హరి ఫైర్

  • రాజకీయ క్రీడ కోసం బీజేపీ ఏపీ ప్రజలను బలి చేస్తోంది
  • చంద్రబాబును ఓడిస్తామని బహిరంగంగా చెప్పాలి
  • ఏపీకి అన్యాయం చేయొద్దు
ఏపీ సీఎం చంద్రబాబును ఏమీ చేయలేక ఇక్కడున్న కొందరు నేతలను బీజేపీ కీలుబొమ్మలుగా వాడుకుంటోందని బీజేపీపై మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. ‘ఏబీఎన్’లో జరిగిన ఓ చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ క్రీడ కోసం బీజేపీ ఏపీ ప్రజలను బలి చేస్తోందని మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు, చంద్రబాబు వద్దన్నారని, ప్యాకేజ్ కావాలన్నారని ఎందుకు చెబుతున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుని ఆయన ప్రశ్నించారు. కావాల్సింది వాదప్రతివాదాలు కాదని, నిజాలని హితవు పలికారు. ఏపీలో బీజేపీ గెలవాలనుకున్నప్పుడు, చంద్రబాబును ఓడిస్తామని బహిరంగంగా చెప్పాలని, పవన్, జగన్ తో కలిసి ఎన్నికల బరిలో దిగుతామని చెప్పండని అన్నారు.

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ ను గెలిపించేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో అర్థమవుతోందని అన్నారు. అధికారం కోసం ఏమైనా చేసుకోండి కానీ, ఏపీకి మాత్రం అన్యాయం చేయొద్దని జీవీఎల్ కు సూచించారు.  
Go Back to Shorts
Chandrababu
sabbam hari
gvl narasimha rao

More Telugu News