హైదరాబాద్ లో భారీ వర్షం.. రహదారులు జలమయం

  • హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • రెండు గంటలకు పైగా కురిసిన వర్షం
  • స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, మోతీనగర్, బోరబండ, పంజాగుట్ట, కూకట్ పల్లి, మారేడ్ పల్లి, కార్ఖానా, అడ్డగుట్ట, తుకారంగేట్, ప్యాట్నీ, జనరల్ బజార్, రాంగోపాల్ పేట, బేగంపేట్, చిలకలగూడ, సీతాఫల్ మండి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో, రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనాలు మెల్లగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది.
Go Back to Shorts
Hyderabad
rain
traffic

More Telugu News