అలహాబాద్ పేరు మారింది.. ప్రతిపక్షాల ఆందోళనలు పట్టించుకోని సీఎం యోగి
- ప్రయాగ్ రాజ్ గా మారిన అలహాబాద్
- ఆమోదముద్ర వేసిన ఉత్తరప్రదేశ్ కేబినెట్
- రుగ్వేదం, మహాభారతం, రామాయణాల్లో ఉన్న ప్రయాగ్ రాజ్
కుంభమేళాకు సంబంధించి రెండు రోజుల క్రితం నిర్వహించిన మీటింగ్ లో అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చాలనే విషయన్ని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారని సిర్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు. యోగి నిర్ణయానికి పీఠాధిపతులు, సాధువులు వెంటనే ఆమోదం తెలిపారని అన్నారు. మరోవైపు, అలహాబాద్ పేరు మార్చకూడదని ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. అయినా వేటినీ లెక్క చేయకుండా మోగి సర్కారు పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది.