Google Street View: ఆమె మోసాన్ని 'గూగుల్ స్ట్రీట్ వ్యూ' పట్టేసింది.. భర్త విడాకులు ఇచ్చేశాడు!

షార్ట్స్‌లో చూడండి
2013లో ఆమె చేసిన తప్పు తాజాగా ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఆ మహిళ తన తప్పును ఒప్పుకోక తప్పలేదు. వెంటనే భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ వింత ఘటన పెరూ దేశంలో జరిగింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రదేశాలను 360 డిగ్రీల కోణంతో దృశ్యాలను రికార్డు చేస్తాయి. పెరూ రాజధాని లిమాలో ఓ వివాహిత వేరొక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఓ పేరుపొందిన బ్రిడ్జి వద్ద గడిపింది.

గూగుల్ కెమెరా కారు ఆ ఫొటోలను తీసేసింది. ఈ ఘటన 2013లో జరిగింది. తాజాగా ఆ మహిళ భర్త లిమాలోని అదే బ్రిడ్జి కోసం గ్యూగుల్ మ్యాపులో శోధించాడు. అయితే అతడికి తన భార్య ఫోటోలు కనిపించాయి. వెంటనే ఆమెను గుర్తు పట్టిన భర్త ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో  ఆ మహిళకు తన తప్పును అంగీకరించక తప్పలేదు. వెంటనే వారిద్దరూ విడాకులు తీసుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే వారిద్దరూ తమ పేర్లు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడలేదు. 
Go Back to Shorts
Google Street View
Peru
Lima
Divorce

More Telugu News