ట్విట్టర్‌ను ఊపేస్తున్న మహిళ ఫొటో.. అదేంటో అర్థంకాక తలలు బాదుకుంటున్న నెటిజన్లు!
- క్షణాల్లోనే వైరల్ అయిన ఫొటో
- అదేంటో అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతున్న నెటిజన్లు
- కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
@LilMaarty అనే ట్విట్టర్ ఖాతాలో కనిపించిన ఈ ఫొటోలో కనిపిస్తున్నది అమ్మాయి మెడేనని కొందరు భావిస్తుండగా, మరి మెడ కాకపోతే ఇంకేమి అయి ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. దట్టంగా జుట్టు ఉండడంతో చూసిన వెంటనే అది మెడేనన్న భ్రాంతికి లోనవుతున్నారు. అయితే, మరికాస్తా ఏకాగ్రతతో చూస్తే అందులోని మర్మం అర్థం అవుతుంది. ఓ మహిళ తన పొడవాటి రింగులు తిరిగిన జట్టును ఫొటోగ్రాఫర్ సాయంతో ఇలా తీయించుకుని పోస్టు చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ అయింది.
‘‘అసలు ఈ ఫొటో వెనక ఉన్న మర్మమేంటో తెలుసుకునేందుకు నాకు ఐదు నిమిషాలు పట్టింది. తొలుత నేను అమ్మాయి మెడే అనుకున్నాను’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘‘నేనైతే ఓ నిమిషం పాటు ఆ ఫొటో వంక తేరిపారా చూశాను. మరి అది మెడ కాకపోతే మరేమై ఉంటుంది?’’ అని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
శనివారం పోస్టు అయిన ఈ భ్రాంతి కలిగించే ఫొటో ఇప్పటి వరకు 31 వేల సార్లకు పైగా షేర్ అయింది. చాలామంది ఈ ఫొటో వెనక ఉన్న మర్మాన్ని బయటపెట్టేందుకు కుస్తీపడుతున్నారు. అసలా మహిళ అలా ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూ, అందులోని మర్మాన్ని పరిష్కరించాల్సి ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాను ఇంతలా కుదిపేస్తున్న ఈ ఫొటో వెనక ఉన్న మర్మాన్ని పోస్టు చేసిన వాళ్లే చెప్పాలి!