kamal hassan: ఆ పని చేస్తే ‘కాంగ్రెస్’తో పొత్తుకు సిద్ధమే: కమలహాసన్

  • డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు తెగదెంపులు చేసుకోవాలి
  • అలా చేస్తే ‘కాంగ్రెస్’తో కలుస్తాం
  • ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ హామీ ఇవ్వాలి

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తమ పార్టీ సిద్ధమేనని, అయితే, డీఎంకేతో ఆ పార్టీ తెగదెంపులు చేసుకోవాలని ఓ షరతు విధించారు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ, డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ తెగదెంపులు చేసుకుంటే, వారితో పొత్తుకు సిద్ధమేనని చెప్పారు, కాంగ్రెస్-మక్కల్ నీది మయ్యమ్ పొత్తుతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ తనకు హామీ ఇవ్వాలని కోరారు.

More Telugu News