Sabarimala: శబరిమలకు మహిళలు వస్తే దాడులు జరగచ్చు.. మాకు సంబంధం లేదు!: ట్రావెన్ కోర్ దేవస్థానం మాజీ ప్రెసిడెంట్ హెచ్చరిక

  • ఏ పులో, మనిషో దాడి చేయవచ్చు
  • వేధింపు జరిగినా ఫిర్యాదు చేయవద్దు
  • రావద్దని మాత్రం చెప్పబోవడం లేదు
  • టీడీబీ మాజీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, శబరిమలలోకి మహిళలు ప్రవేశిస్తే, అది ఓ 'థాయ్ లాండ్'గా మారిపోతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మాజీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు శబరికి రావొద్దని తాను చెప్పబోనని, ఇదే సమయంలో వారిపై ఏ పులో, మనిషో దాడి చేస్తే మాత్రం, ఫిర్యాదులు చేయవద్దని అన్నారు.

 కొండపైకి వచ్చే మహిళలకు తాము స్వాగతం పలుకుతామని చెప్పారు. ఏదైనా అనర్థాలు జరిగితే మాత్రం తమకు సంబంధం లేదని అన్నారు. మహిళలు కొండపైకి వస్తే దాడులు జరగవచ్చని, వేధింపులూ ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, కేరళ వ్యాప్తంగా నిరసనలు జోరందుకున్నాయి. వేలాది మంది రహదారులపై ధర్నాలకు దిగుతుండగా, బీజేపీ, కావాలనే నిరసనలు చేయిస్తోందని కేరళ సర్కారు ఆరోపిస్తోంది.

More Telugu News