సీఎం రమేశ్ ఇంట్లో హైటెక్ ఫింగర్ ప్రింట్ లాకర్లు.. తెరిచేందుకు హైదరాబాద్ రావాలని కోరిన ఐటీ అధికారులు!
- నగరానికి పయనమైన సీఎం రమేశ్
- సాయంత్రం 6 కల్లా హైదరాబాద్ కు వచ్చే అవకాశం
- రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు
సీఎం రమేశ్ సమర్పించిన రిటర్నులకు, ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్ ఇళ్లు, ఆఫీసులతో పాటు ప్రొద్దుటూరులో ఆయన బంధువు గోవర్ధన్ నాయుడు ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఉద్యమించినందుకే తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయని సీఎం రమేశ్ ఇంతకుముందు ఆరోపించారు. ఎన్నిరకాలుగా హింసించినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.