Sensex: ఉదయం నుంచే దూకుడు.. వెల్లువెత్తిన కొనుగోళ్లతో మార్కెట్ బుల్ జంప్!

  • 380 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
  • ఓ దశలో 400 పాయింట్లకు పైగా లాభం
  • ఐటీ మినహా అన్ని ఈక్విటీలూ లాభాల్లోకి

ఇటీవలి కాలంలో పడుతూ, లేస్తూ నష్టాల మధ్య సాగుతూ వచ్చిన భారత స్టాక్ మార్కెట్ బుధవారం నాడు భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. పలు కంపెనీల ఈక్విటీలు 52 వారాల కనిష్ఠస్థాయికి చేరడంతో, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు వచ్చింది. పలు కంపెనీల ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నించారు. దీంతో సెషన్ ఆరంభంలో క్రితం ముగింపునకు దగ్గరగానే ఉన్న సెన్సెక్స్, సూచిక, ఉదయం 10 గంటల సమయానికి 200 పాయింట్లను, ఆపై 12 గంటల సమయానికి 400 పాయింట్లకు పైగా లాభంలోకి వెళ్లింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ క్రితం ముగింపుతో పోలిస్తే 380 పాయింట్లు పెరిగి, 34,680 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సూచిక 136 పాయింట్లు పెరిగి 10,437 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, టైటాన్, జడ్ఈఈఎల్ వంటి కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

More Telugu News