మత్తుమందిచ్చి రేప్ చేశాడు.. బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై రచయిత్రి వింతా నందా సంచలన ఆరోపణలు!
Add ap7am to your home Screen

మత్తుమందిచ్చి రేప్ చేశాడు.. బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై రచయిత్రి వింతా నందా సంచలన ఆరోపణలు!

  • అలోక్ నాథ్ కుసంస్కారి
  • పార్టీకి వెళితే మత్తుమందు కలిపిన మద్యం తాగించాడు 
  • తెల్లారేసరికి చాలా నొప్పిగా అనిపించింది
  • ఆపై ఎన్నోమార్లు బలాత్కరించాడన్న వింతా నందా
ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో సంస్కారవంతుడి పాత్రలను పోషించే అలోక్ నాథ్, ఓ కుసంస్కారి అని, తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ప్రముఖ రచయిత్రి, 'తారా' ఫేమ్ వింతా నందా సంచలన ఆరోపణలు చేశారు. ఓ సారి పార్టీకి వెళ్లగా, మత్తుమందు కలిపిన మద్యం తాగించి, తొలిసారిగా ఆయన బలాత్కరించాడని ఆమె ఆరోపించింది.

నాటి సాయంత్రం తనకు మత్తుమందిచ్చిన అలోక్ నాథ్, రాత్రి 2 తరువాత ఇంట్లో దింపుతానని చెప్పి, తన కారులో ఎక్కించుకున్నాడని, నాటి అనుభవాన్ని వెల్లడించారు వింతా నందా. ఆ తర్వాత మరింత మద్యం తాగించి, తనపై అత్యాచారం చేశాడని, తెల్లారేసరికి తనకు చాలా నొప్పిగా అనిపించిందని చెప్పింది. తన స్నేహితులకు ఈ విషయం చెబితే, వారు మౌనంగా ఉండమని సలహా ఇచ్చారని వాపోయింది. ఆ తరువాత అలోక్ నాథ్, తనను భయపెట్టి, ఎన్నోమార్లు లైంగికంగా వేధించాడని, తను ఎంతో క్షోభను అనుభవించానని చెప్పింది. 
Alok Nath
Bollywood
MeToo
Rape
Vinta Nanda

More Telugu News