నేడు మళ్లీ నష్టాలలో స్టాక్ మార్కెట్లు!
- ఆటోమొబైల్, ఇంధన షేర్లలో అమ్మకాల వెల్లువ
- సెన్సెక్స్ 174.91 పాయింట్ల నష్టం
- నిఫ్టీ 47 పాయింట్ల లాస్
సెన్సెక్స్ సూచికలోని 30 షేర్లలో 14 కంపెనీల షేర్లు నష్టపోగా, వీటిలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, మారుతి, హిందూస్తాన్ అన్ లీవర్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ సంస్థల షేర్లు అత్యధికంగా నష్టాలను చవిచూశాయి. ఇక అదానీ పోర్ట్స్, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి.