Kalingapatnam: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

  • గంటకు 65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు
  • 48 గంటల్లో తీవ్ర వాయుగుండం బలపడి తుపాను
  • మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. దీని ప్రభావం కారణంగా రేపు, ఎల్లుండి ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని, తీరం వెంబడి గంటకు 65 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని విపత్తుల శాఖ వెల్లడించింది.

కళింగపట్నానికి 690 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 720 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 24 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, 48 గంటల్లో అదికాస్తా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. మత్స్యకారులను వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది.

More Telugu News