ఏనుగుపై ఊరేగిస్తుండగా జారి కిందపడ్డ అసోం అసెంబ్లీ స్పీకర్!
- కరీంగంజ్ జిల్లాలోని రాతాబరిలో సంఘటన
- కృపనాథ్ ను ఏనుగుపై ఊరేగించిన మద్దతుదారులు
- ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదన్న అనుచరులు
ఈ సందర్భంగా కృపనాథ్ మల్లాహ్ తన నియోజకవర్గానికి వెళ్లారు. కృపనాథ్ మల్లాహ్ మద్దతుదారులు ఆయన్ని ఏనుగుపై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆయన ఏనుగుపై నుంచి జారి కిందపడ్డారు. వెంటనే స్పందించిన వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు ఆయన వద్దకు వెళ్లారు ఈ సంఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కృపనాథ్ అనుచరులు తెలిపారు.