komatireddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ ఫైల్ పైనే: కోమటిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరాభవం తప్పదని, టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై తొలి సంతకం పెడతామని చెప్పారు.

 కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని... తండ్రి సీఎం, కొడుకు, అల్లుడు మంత్రులు, కుమార్తె ఎంపీ అయ్యారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని తెలిపారు. నల్గొండలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
komatireddy
kcr
TRS
congress

More Telugu News