'బిగ్ బాస్ 2' నుంచి రెండోవారంలోనే బయటికి వచ్చేద్దామనుకున్నాను: కౌశల్
- ఇంట్లోని వాళ్లంతా ఒక్కటైపోయారు
- అంతా నాపై ఎటాక్ చేయడం మొదలుపెట్టారు
- అలాంటప్పుడే కౌశల్ ఆర్మీ తయారైందట
ఇంట్లో వున్న వాళ్లంతా నాపై ఎటాక్ చేస్తూ నన్ను బయటికి పంపించాలనుకున్నప్పుడు, నన్ను సపోర్ట్ చేస్తూ బయట కౌశల్ ఆర్మీ తయారైంది. ఇంట్లోని వాళ్లంతా ఏకమైనప్పుడు రెండవ వారంలోనే నాకు బయటికి వచ్చేయాలని అనిపించింది. బయట హాయిగా ఉండేవాళ్లం .. ఇక్కడికి వచ్చి మాటలు పడవలసిన అవసరం ఏవుంది? అనిపించింది. ఒక సందర్భంలో నూతన్ నాయుడు .. నేను .. మాలో ఎవరో ఒకరు వెళ్లిపోవాలి. అప్పుడు నన్ను పంపించేయమని నానితో చెప్పాను. నాకు బయట ఎంతోమంది అభిమానులు తయారయ్యారనే విషయాన్ని నాని చెప్పడంతో, ఇక వాళ్ల కోసం ఆడాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.