Andhra Pradesh: వచ్చే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు: వాతావరణశాఖ

  • సోమవారం టాటా చెప్పేయనున్న నైరుతి రుతుపవనాలు
  • ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
  • అల్ప పీడనంగా మారనున్న ఆవర్తనం

వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో ఆవరించిన ఆవర్తనంతో సోమవారం దక్షిణ, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆవర్తనం మూడు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా, ఒడిశా దిశగా పయనిస్తుందని తెలిపారు.  

మరోవైపు నైరుతి ఉపసంహరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, శనివారం మచిలీపట్నం, కర్నూలు నుంచి రుతు పవనాలు నిష్క్రమించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఇవి దక్షిణాది నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయని, ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వివరించారు.

More Telugu News