చరణ్ మూవీకి పవన్ టైటిల్
- బోయపాటితో చరణ్ మూవీ
- కథానాయికగా కైరా అద్వాని
- కీలకపాత్రలో సీనియర్ హీరో ప్రశాంత్
ఇక ఇప్పుడు ఈ సినిమాకి 'తమ్ముడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ లకి తమ్ముడిగా చరణ్ కనిపించనున్నాడు. అందువలన ఈ టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. పవన్ కల్యాణ్ కెరియర్లో 'తమ్ముడు' చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి టైటిల్ ను చరణ్ కి వాడటం వలన సినిమా పట్ల మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.