బస్సులో పరిచయమైన అమ్మాయిని ప్రేమలోకి దింపి మోసం .. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!
- హైదరాబాద్, ఎల్బీ నగర్ లో ఘటన
- ఫిజియో థెరపిస్టుకు మాయమాటలు చెప్పిన యువకుడు
- లోబరచుకుని, మరో పెళ్లి చేసుకున్న వైనం
ఆ పరిచయాన్ని పెంచుకున్న అతను, ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ఆమెకు ఓ గది అద్దెకు కావాల్సి వస్తే, తమ ఇంట్లోని గదిని అద్దెకు ఇచ్చేలా చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరచుకున్నాడు. తర్వాత ఈమెకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, వారు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.