తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన టీమిండియా.. సెంచరీతో నాటౌట్ గా నిలిచిన జడేజా
- 649 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
- సెంచరీలు సాధించిన షా, కోహ్లీ, జడేజా
- తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విండీస్
విండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు, లూయిస్ 2 వికెట్లు పడగొట్టగా... గాబ్రియెల్, ఛేస్, బ్రాత్ వైట్ లు చెరో వికెట్ తీశారు. పుజారా-షాల మధ్య 206 పరుగులు, కోహ్లీ-రహానేల మధ్య 105 పరుగులు, కోహ్లీ-పంత్ ల మధ్య 133 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. బ్రాత్ వైట్, పావెల్ ను ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. తొలి ఓవర్ ను షమీ వేశాడు.