మీడియా వెంబడించడంతో 'ప్లాన్ బీ' అమలు చేస్తున్న ఐటీ అధికారులు!
- వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికారులు
- మీడియా వెనకే ఉండటంతో తొలుత నారాయణ కాలేజీ వద్దకు
- వివరాలు తామే చెబుతామన్న అధికారులు
అందులో భాగంగానే ఏపీ మంత్రి నారాయణ కాలేజీకి దాడులకు వెళుతున్నట్టుగా వెళ్లిన అధికారులు, మీడియా వెంబడించడంతో, లోపలికి వెళ్లినట్టే వెళ్లి వెనక్కు తిరిగి వచ్చారని తెలుస్తోంది. అక్కడి నుంచి బందర్ రోడ్డులోకి తమతమ వాహనాల్లో బయలుదేరిన అధికారులు, మీడియాను తమవెంట రావద్దని, మధ్యాహ్నం తరువాత తామే వివరాలను వెల్లడిస్తామని చెబుతూ, పోలీసులను అడ్డు ఉంచి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.
అధికారులు వ్యూహాత్మకంగానే నారాయణ కాలేజీ వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఆపై అధికారులు బందర్ రోడ్డులోని రెండు నిర్మాణ రంగ కంపెనీలపై దాడులు ప్రారంభించారు. ఈ వార్త కూడా మీడియాకు తెలియడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.