Uttar Pradesh: బాలికపై లైంగిక దాడి.. ఎదురు తిరగడంతో హత్య!

షార్ట్స్‌లో చూడండి
పదిహేనేళ్ల బాలికపై నలుగురు యువకులు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె ఎదురు తిరగడంతో తట్టుకోలేక చంపేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మెయినపురి జిల్లాలో గాంధీ జయంతి రోజునే ఈ దారుణం  జరిగింది. వివరాల్లోకి వెళితే... బాధిత బాలిక జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. గాంధీ జయంతి రోజున పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లింది.

కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి ఇంటికి వస్తుండగా దారి మధ్యలో నలుగురు యువకులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెపై లైంగిక దాడికి దిగారు. ఈ హఠాత్పరిణామంతో విస్తుపోయిన బాలిక నలుగురు యువకులను ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఎదురు తిరగడాన్ని సహించలేని నిందితులు ఆమెను తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆమె దుపట్టా (చున్నీ)నే మెడకు చుట్టి సమీపంలోని చెట్టుకు వేలాడదీసి ఉరితీశారు. విషయం వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితులైన శివం, మంగల్‌, వికాస్‌లను అరెస్టు చేశారు.
Go Back to Shorts
Uttar Pradesh
mainpuri
rape

More Telugu News