రాహుల్ గాంధీ-కరీనాపూర్ లవ్ స్టోరీ.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ రషీద్ కిద్వాయి!
- రాహుల్ ను ఇష్టపడ్డ కరీనాకపూర్
- డేట్ కు వెళ్లాలని 2002లో నిర్ణయం
- సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ పుస్తకంలో వెల్లడి
తన పుస్తకం ‘నేతా-అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటంతో 2002లో కరీనా రాహుల్ తో డేట్ కు వెళ్లాలని అనుకున్నారట. అంతేకాదు, కరీనా నటించిన ఏ సినిమానైనా రాహుల్ గాంధీ ఫస్ట్ డే ఫస్ట్ షోను చూసేవారట. గతంలో ఓ టీవీ షోకు హాజరైన కరీనా.. రాహుల్ గాంధీతో డేట్ కు వెళ్లడాన్ని ఇష్టపడతానని చెప్పిన సంగతిని కిద్వాయి తన పుస్తకంలో ప్రస్తావించారు. గాంధీ, కపూర్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అప్పట్లో కరీనా స్వయంగా చెప్పినట్లు కిద్వాయి ఉటంకించారు.