ఈ రియల్ హీరో ఎవరో తెలిస్తే చెప్పండి... సన్మానిస్తాం: హైదరాబాద్ పోలీసులు
- బుధవారం నాడు అత్తాపూర్ లో దారుణ హత్య
- హంతకుడిని ఆపేందుకు విఫలయత్నం చేసిన వ్యక్తి
- అతని గురించి ఆరా తీస్తున్న పోలీసులు
తొలుత ఆ వ్యక్తి అత్తాపూర్ లో ఉన్న ఓ షోరూం నిర్వాహకుడని భావించి, అక్కడి షాపుల్లో విచారించినా, అతని ఆచూకీ తెలియరాలేదని, అతను రియల్ హీరో అని రాజేంద్రనగర్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. అతను ఎవరో తెలిస్తే, కమిషనర్ కార్యాలయానికి పిలిపించి, సన్మానిస్తామని అన్నారు.
కాగా, ఈ కేసులో రమేష్ ను కాపాడేందుకు తనవంతుగా తీవ్ర ప్రయత్నం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తికి సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ అభినందనలు తెలిపారు. అతనికి క్యాష్ రివార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు.