కృష్ణా నీళ్లతో సీమ పంటలను కాపాడుతున్నాం.. కడపలో మంత్రి ఆదినారాయణ రెడ్డి!
- జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
- చంద్రబాబు చొరవతోనే సీమకు సాగు, తాగునీరు
- గండికోట రిజర్వాయర్ కు 32 టీఎంసీల నీరు
ఆంధ్రప్రదేశ్ ను పచ్చగా మార్చాలన్న సీఎం చంద్రబాబు సంకల్పంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందుతోందని మంత్రి ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము కడపకు 32 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకురావాలని ప్లాన్ వేసినట్లు వెల్లడించారు. వీటిలో పాత మైలవరం ప్రాజెక్టుకు 6-7 టీఎంసీలు, పెన్నా నదికి 3 టీఎంసీలు, చిత్రావతి రిజర్వాయర్ కు 6 టీఎంసీలు, పైడిపాలెం ప్రాజెక్టుకు మరో 4 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు చొరవతోనే రాయలసీమకు సాగు, తాగునీరు అందుతోందని స్పష్టం చేశారు.