ఎయిర్‌టెల్ అధినేతతో చంద్రబాబు భేటీ.. పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం

  • సునీల్ మిట్టల్‌తో అమెరికాలో భేటీ
  • ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
  • సానుకూలంగా స్పందించిన ఎయిర్‌టెల్ అధినేత
దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడే సునీల్ మిట్టల్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.

కాగా, గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీ భాగస్వామ్యంతో భారతీ గ్లోబల్ ఇప్పటికే వివిధ దేశాల్లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టింది. ఏపీలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భాగస్వామ్య సంస్థ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Airtel
Sunil Mittal
America

More Telugu News